Bigg Boss telugu 5: ఇంకోసారి రా అనకు..  నీకు ఆ అర్హత లేదు: సన్నీ - telugu news latest promo of bigg boss telugu 5
close
Updated : 20/10/2021 18:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss telugu 5: ఇంకోసారి రా అనకు..  నీకు ఆ అర్హత లేదు: సన్నీ

సిరిపై సన్నీ ఫైర్‌

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో వాతావరణం వాడీవేడీగా మారింది. కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కోడిగుడ్లను సేకరించే క్రమంలో సన్నీ-ప్రియల మధ్య తీవ్ర మాటల యుద్ధమే జరిగింది. సేకరించిన గుడ్లను ఓ బుట్టలో పెట్టి.. మరిన్ని గుడ్ల కోసం సన్నీ ప్రయత్నిస్తుండగా.. ఆయన దాచుకున్న వాటిని ప్రియ దొంగిలించింది. ‘‘నాకు బుట్ట దొరికింది’’ అంటూ ప్రియ.. సన్నీ దాచుకున్న కోడిగుడ్లు దొంగిలిస్తుండగా.. వెంటనే అక్కడికి చేరుకున్న సన్నీ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆగ్రహానికి గురైన ఆమె.. ‘‘మర్యాదగా ఉండదు. చెంప పగిలిపోతుంది’’ అని విరుచుకుపడింది. ‘‘నోరు పారేసుకోకు. కష్టపడి సొంతం చేసుకున్న వాటిని ఇలా చేస్తే ఊరుకోవాలా?’’ అని సన్నీ.. ప్రియపై కేకలు వేశారు. ‘‘నా ఇష్టం. నా గేమ్‌ ఇదే. మీరు అర్ధరాత్రిపూట దొంగతనం చేస్తే.. దొంగతనం కాదు. కష్టపడి ఆడినట్లు’’ అంటూ ఆమె దీటుగా సమాధానమిచ్చింది. ఆ మాటలతో మరింత కోపానికి గురైన సన్నీ.. ‘‘ఆట ఆడటం కూడా చేతకాదు. చేతకాని వారు వస్తారు ఇక్కడికి’’ అని అనగా.. ‘‘ఏయ్‌.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగిలిపోతుంది’ అని ప్రియ మాటల దాడికి దిగారు. దీంతో సన్నీ.. ‘‘ఇంకోసారి చెంప పగిలిపోతుందంటే బాగోదు. దమ్ముంటే కొట్టు’’ అంటూ ప్రియతో యుద్ధానికి దిగాడు. ఇలా, ప్రియ-సన్నీల మధ్య వివాదం పెరగడంతో హౌస్‌ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని