Naveen Polishetty: మన ‘జాతిరత్నం’.. మరో కామెడీ చిత్రం - telugu news naveen polishetty new film announcement
close
Published : 15/09/2021 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Naveen Polishetty: మన ‘జాతిరత్నం’.. మరో కామెడీ చిత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మారి, తొలి ప్రయత్నంలోనే నవీన్‌ పొలిశెట్టి మంచి విజయం అందుకున్నాడు. డిటెక్టివ్‌గా కనిపించి నవ్వులు పంచాడు. ఆ తర్వాత ‘జాతి రత్నాలు’ అంటూ రాహుల్‌ రామకృష్ణ,  ప్రియదర్శితో కలిసి సందడి చేశాడు. ఈ రెండు చిత్రాలు అందించిన విజయోత్సాహంతో మరో కామెడీ కథతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్య్చూన్‌ ఫర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కల్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందిస్తున్నట్టు చిత్రబృందం తెలియజేసింది. ‘మన జాతిరత్నం.. యంగ్ సెన్సేషన్‌ నవీన్ పొలిశెట్టి ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తున్నాడు’ అంటూ ఓ వీడియోను పంచుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని