Crime news: దివ్యాంగురాలిపై అత్యాచారం... వైకాపా నేత అరెస్టు - telugu news rape case accused arrest
close
Published : 25/09/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime news: దివ్యాంగురాలిపై అత్యాచారం... వైకాపా నేత అరెస్టు

నర్సీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సీలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీకే వీధి సీఐ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. ‘‘ఈనెల 21న అర్ధరాత్రి 12గంటల సమయంలో విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వైకాపా గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు నాళ్ల వెంకట్రావు(40) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి నిందితుడికోసం గాలిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని ఒడిశా వెళ్లేందుకు శుక్రవారం ఉదయం వెంకట్రావు ప్రయత్నించగా.. సీలేరు జలాశయం వద్ద అదుపులోకి తీసుకున్నాం. విశాఖ కేజీహెచ్‌లో వైద్యపరీక్షల అనంతరం నిందితుడిని నర్సీపట్నం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చాం’’ అని సీఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని