Rishabh Pant: అలాగైతే రిషభ్‌ పంతే కెప్టెన్‌! డీసీ స్పష్టతకు వచ్చినట్టేనా? - telugu news rishabh pant likely to continue as delhi capitals skipper in uae leg
close
Published : 30/08/2021 18:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rishabh Pant: అలాగైతే రిషభ్‌ పంతే కెప్టెన్‌! డీసీ స్పష్టతకు వచ్చినట్టేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ రెండో దశలో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషభ్ పంతే ఉండనున్నాడు! గాయం నుంచి కోలుకొని వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌పై మరీ ఒత్తిడి పెట్టొద్దని దిల్లీ యాజమాన్యం భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం శ్రేయస్‌ దుబాయ్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌కు ముందు టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీసులు ఆడింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడుతుండగా ఫీల్డింగ్‌ చేస్తూ శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడ్డాడు. అతడి భుజం ఎముక పక్కకు తొలగడంతో శస్త్రచికిత్స అవసరమైంది. ఫలితంగా ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. బయో బుడగలోకి కరోనా వైరస్‌ ప్రవేశించడంతో లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ లోపు కోలుకున్న శ్రేయస్‌ రెండో దశకు సిద్ధమయ్యాడు. అతడి రాకతో ఫ్రాంచైజీకి మరో తలనొప్పి ఎదురైంది.

ఎందుకంటే గత సీజన్లలో శ్రేయస్‌ జట్టును నడిపించాడు. అతడు లేకపోవడంతో బాధ్యతలు రిషభ్ పంత్‌కు అప్పగించారు. అతడు నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. వరుస విజయాలు అందజేశాడు. ఇప్పుడు శ్రేయస్‌ రావడంతో ఎవరిని కెప్టెన్‌ చేస్తారోనన్న సందేహాలు కలుగుతున్నాయి. కాగా శ్రేయస్‌పై మరీ ఎక్కువ భారం మోపకూడదని ఫ్రాంచైజీ భావిస్తోందట.

‘నిజానికి శ్రేయస్‌ అయ్యర్‌ కోలుకొని తిరిగిరావడం గొప్ప శుభవార్త. అతడు క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఐతే అతడు  కోలుకోవడానికి మరింత సమయం ఇవ్వాలని డీసీ యాజమాన్యం భావిస్తోంది. అంటే ఐపీఎల్‌ రెండో దశకు రిషభ్ పంత్‌ సారథ్యం వహిస్తాడు’ అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని