Genelia DSouza: జెనీలియా బర్త్‌డే.. రితీశ్‌ హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌  - telugu news riteish about genelia on her birthday
close
Published : 06/08/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Genelia DSouza: జెనీలియా బర్త్‌డే.. రితీశ్‌ హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్: జెనీలియా, రితీశ్‌.. చూడ ముచ్చటైన జంట. తెరపై ఎంతగా సందడి చేస్తారో తెరవెనక అంతకు మించి అనిపిస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో తమకు సంబంధించిన ఫన్నీ వీడియోలు పోస్ట్‌ చేసి నెటిజన్లని ఆకట్టుకుంటుంటారు. జెనీలియా గురించి రితీశ్‌, రితీశ్‌ గురించి జెనీలియా పోస్టులు పెడుతూ టామ్‌ అండ్‌ జెర్రీలా సందడి చేస్తుంటారు. ఆ జ్ఞాపకాలన్నింటినీ ఓ వీడియోలో బంధించి జెనీలియా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు కానుకగా అందించారు రితీశ్‌. తన మనసులోని మాటని అక్షరీకరించారు. ‘‘జెనీలియా.. పొద్దున్న లేవగానే నీ ముఖాన్ని చూడటాన్ని మించిన ఫీలింగ్‌ నాకు మరొకటి లేదు. మనం 20 ఏళ్లుగా కలిసుంటున్నా నిన్ననే పరిచయమైనట్టుంది. నన్ను అర్థం చేసుకునే భార్యగా ఉన్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే! ఈ రోజు ఎందుకో చిన్నదానిలా కనిపిస్తున్నావు. ‘నువ్వూ అంతే’ అని సమాధానం ఇవ్వకు. చూస్తూ ఉండు ‘జెనీలియా పక్కన ఉన్న ఈ అంకుల్‌ ఎవరు? అని అందరూ అడుగుతారు’’ అని రితీశ్‌ సరదాగా రాసుకొచ్చారు. ‘థ్యాంక్‌ యు.. నీలోనే నా ప్రపంచాన్ని చూశాను. నేను ఈ స్థాయికి ఎదిగేందుకు కారణం నువ్వే. నా కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా’ అని రితీశ్‌కి జెనీలియా రిప్లై ఇచ్చారు. బాలీవుడ్‌ ప్రముఖులతోపాటు టాలీవుడ్‌, కోలీవుడ్‌ తారలూ రితీశ్‌ పోస్ట్‌కి ఫిదా అయి, జెనీలియాకి శుభాకాంక్షలు తెలిపారు.

‘తుజే మేరి కసమ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు వీరిద్దరు. ఆ పరిచయమే ప్రేమగా మారింది. కొన్ని సమస్యలు ఎదురైనా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2012లో వివాహం చేసుకున్న ఈ దంపతులకి ఇద్దరు అబ్బాయిలు. ‘బాయ్స్‌’, ‘బొమ్మరిల్లు’, ‘ఆరెంజ్‌’ తదితర చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది జెనీలియా. నిర్మాత, నటుడిగా బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు రితీశ్‌.  




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని