Chitra: ఒక్క రోజులో 16 పాటలు పాడా.. అది తెలిసి అమ్మ కోప్పడింది - telugu news singer chitra interview with ali on etv alitjo saradaga promo
close
Published : 27/07/2021 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chitra: ఒక్క రోజులో 16 పాటలు పాడా.. అది తెలిసి అమ్మ కోప్పడింది

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఓ రోజు 16 పాటలు ఆలపించి అలసిపోయి ఇంటికి వచ్చాను. అప్పుడు నన్ను చూసిన అమ్మ ఆరోగ్యం చూసుకోవాలి... ఇలా చేయకూడదు ఎప్పుడూ అంటూ నాపై కోప్పడింది’ అని ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ గాయని చిత్ర. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి, తన మనసులో మాటని పంచుకున్నారామె. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఆలీ అడిగే ప్రతి ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చారు చిత్ర. అన్ని భాషలు కలిపి సుమారు 20 వేల పాటలు పాడినట్టు తెలిపారు.

దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వల్ల తెలుగు నేర్చుకున్నానని చెప్పారు. తన పాప పేరు మీద స్థాపించిన ట్రస్ట్‌ ద్వారా 60 ఏళ్లకు పైబడిన (చూడటానికి ఎవరూ లేని) వారికి పెన్షన్‌ అందిస్తున్నట్టు వివరించారు. ఓ అరబిక్‌ గీతం, ‘క్రిమినల్‌’లోని ‘తెలుసా మనసా’ గీతాన్ని ఆలపించి సందడి చేశారు. పాటలు మాత్రమే కాదు డైలాగులూ చెప్పి వావ్‌ అనిపించారు. ‘చెయ్యి చూడు ఎంత రఫ్‌గా ఉందో, రఫ్పాడించేస్తా’, ‘ఫ్లూటు జింక ముందు ఊదు సింహం కాదు’ వంటి పవర్‌ఫుల్‌ సంభాణల్ని తనదైన శైలిలో పలికి అలరించారు.

మీ కెరీర్‌లో.. ఒక్క రోజులో అత్యధికంగా ఎన్ని పాటలు పాడారు? అని ఆలీ అడిగ్గా.. ‘16 పాటలు పాడాను. ఆ రోజు అమ్మ నాపై కోప్పడింది’ అని బుదులిచ్చారు చిత్ర. జాతీయ అవార్డు తీసుకునే సమయంలో తన తండ్రి లేకపోవడం చాలా బాధకలిగించిందని భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి కార్యక్రమం ఆగస్టు 2న ప్రసారమవుతుంది. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి... అన్నట్టు నేడు (జులై 27) చిత్ర పుట్టిన రోజు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని