Maroprastanam: రిలీజ్‌కు సిద్ధమైన మరోప్రస్థానం - telugu news tanish starer maroprastanam team plans to release thier movie in this month
close
Published : 11/09/2021 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maroprastanam: రిలీజ్‌కు సిద్ధమైన మరోప్రస్థానం

హైదరాబాద్‌: తనీశ్‌, ముస్కాన్ సేథీ జంటగా నటించిన విభిన్న కథా చిత్రం ‘మరో ప్రస్థానం’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. హిమాలయస్టూడియో మాన్షన్స్, ఉదయ్‌కిరణ్‌ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ‘రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్‌లో జరిగితే, సరిగ్గా అదే టైమ్‌కు సినిమా పూర్తి అవుతుంది. రెగ్యులర్‌గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఓ ఎమోషనల్ కిల్లర్ జర్నీ. ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులు ఉత్కంఠకు లోనవుతారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని