close
Published : 23/02/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘ఉప్పెన’పై మహేశ్‌బాబు ప్రశంసలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ‘ఉప్పెన’ చిత్రంపై అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ప్రశంసల వర్షం కురిపించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్ననలను అందుకుంటోంది. తాజాగా ఆ చిత్రాన్ని వీక్షించిన మహేశ్‌బాబు.. చిత్రబృందాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. ‘ఉప్పెన’ ఓ క్లాసిక్‌ అని ఒక్కమాటలో వర్ణించారు. ‘బుచ్చిబాబు.. మీరు ఇండస్ట్రీలో ఓ అరుదైన సినిమా చేశారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం హృదయం లాంటిది. అంత అద్భుతమైన సంగీతం అందించారు. తొలి చిత్రంతోనే అందర్నీ కట్టిపడేసిన వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టిని హృదయపూర్వంగా అభినందించకుండా ఉండలేకపోతున్నా. ఒక్క సినిమాతోనే వాళ్లు స్టార్లుగా మారిపోయారు. ఇలాంటి చిత్రానికి వెన్నుదన్నుగా నిలిచిన సుకుమార్‌, మైత్రీ మూవీమేకర్స్‌కు హ్యాట్సాఫ్‌’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని