రోహిత్‌ రాగానే కోహ్లీకి విశ్రాంతినిస్తారా: వీరూ సీరియస్‌ - virender sehwag questions skipper for resting in form rohit sharma
close
Published : 14/03/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోహిత్‌ రాగానే కోహ్లీకి విశ్రాంతినిస్తారా: వీరూ సీరియస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో రోహిత్‌శర్మకు విశ్రాంతినివ్వడంపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఎందుకు ఆడించలేదని వీరేంద్ర సెహ్వాగ్‌ అడిగాడు. మరి ఇదే నియమం కెప్టెన్‌ కోహ్లీకీ వర్తిస్తుందా అని తీవ్రంగా ప్రశ్నించాడు. విరామం తీసుకుంటానని విరాట్‌ అడిగిన సందర్భాలు ఒక్కటీ కనిపించడం లేదని వెల్లడించాడు. తొలి మ్యాచులో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

‘హిట్‌మ్యాన్‌కు కొన్ని మ్యాచుల్లో విరామం ఇచ్చామని చెప్పారు. మరి ఇదే నియమం కెప్టెన్‌ కోహ్లీకీ వర్తిస్తుందా? ఒక సారథిగా తర్వాతి రెండు, మూడు మ్యాచులకు విశ్రాంతి తీసుకుంటానని కోహ్లీ చెప్పడం నేనెరుగను. తనకు తానుగా విరాట్‌ విశ్రాంతి తీసుకున్న సందర్భాలూ నాకు తెలియవు. మరి కెప్టెనే తీసుకోనప్పుడు ఇతరులకు మాత్రం అతడు విరామం ఎందుకివ్వాలి? దానిని ఆటగాడికే వదిలేయాలి’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

‘ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టుల్లో రోహిత్‌ అద్భుతంగా ఆడాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి ఫామ్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ చాటాలని ఎదురుచూస్తుంటాడు. సుదీర్ఘ ఫార్మాట్లో తనను తాను వ్యక్తపరుచుకొనే అవకాశాలు దొరకవు. అదే తెలుపు బంతి క్రికెట్లో స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ సిక్సర్లు, బౌండరీలు బాదే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు డిఫెండ్‌ చేయాలని అనుకుంటారు. అభిమానులను అలరించాలని కోరుకుంటారు. నేను అడిగేది ఒక్కటే. రోహిత్‌ పునరాగమనం చేయగానే కోహ్లీ విశ్రాంతి తీసుకుంటాడా? నీకు (కోహ్లీ) ఇష్టమైనప్పుడు రోహిత్‌, ఇషాంత్‌, షమి, బుమ్రాకు విశ్రాంతినిస్తావు. కానీ నీకు మాత్రం అదెందుకు వర్తించదు?’ అని వీరూ సీరియస్‌ అయ్యాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని