ప్రభాస్‌.. ఇదస్సలు ఊహించలేదు: కృష్ణంరాజు - we knew he had achieve fame but this is unexpected says krishnam raju about prabhas
close
Published : 22/01/2021 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌.. ఇదస్సలు ఊహించలేదు: కృష్ణంరాజు

హైదరాబాద్‌: నటనలో పెదనాన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ‘ఈశ్వర్‌’తో వెండితెరకు కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌ ‘బాహుబలి’తో పాన్‌ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రభాస్‌కు లభించిన ఈ గుర్తింపును తమ కుటుంబం అస్సలు ఊహించలేదని రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అన్నారు. ఇటీవల తన పుట్టినరోజు నాడు మీడియాతో ముచ్చటించిన కృష్ణంరాజు.. ప్రభాస్‌ సినీ కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘కెరీర్‌పరంగా ప్రభాస్‌ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అతను పడిన కష్టానికి తగిన గుర్తింపు ఇది. ‘బాహుబలి’లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ప్రపంచవ్యాప్తంగా మనదేశం గర్వపడేలా చేశాడు. ప్రభాస్‌.. నటుడిగా కెరీర్‌ను ఆరంభంచిన సమయంలో కచ్చితంగా ఫేమస్‌ అవుతాడని మేము అనుకున్నాం. కానీ ఇంత గొప్ప స్థాయికి వస్తాడని అస్సలు ఊహించలేదు. కథల ఎంపిక విషయంలో కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. అతని తర్వాతి ప్రాజెక్ట్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా ప్రభాస్‌ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు. ఎన్నో విజయాల తర్వాత కూడా ప్రభాస్‌లో ఎలాంటి గర్వం లేదు. ఇక ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించడంలో అస్సలు రాజీపడడు. నా నుంచే ఆ అలవాటు ప్రభాస్‌కు వచ్చింది. ఎందుకంటే నేను కూడా భోజన ప్రియుడినే.’ అని కృష్ణంరాజు వివరించారు.’

ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్నారు. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. ఇందులో కృష్ణంరాజు.. పరమహంస అనే పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మరోవైపు ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, నాగ్‌అశ్విన్‌తో మరో ప్రాజెక్ట్‌లను ప్రభాస్‌ ప్రకటించారు.

ఇదీ చదవండి

మహేశ్‌కు ఈరోజు చాలా స్పెషల్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని