WTC Finals: కోహ్లీ సేనతో పోరు సవాలే - wtc final excited to be playing india always a challenge says kane williamson
close
Published : 18/05/2021 13:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Finals: కోహ్లీ సేనతో పోరు సవాలే

ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: విలియమ్సన్‌

ముంబయి: టీమ్‌ఇండియాతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ కోసం ఎదురు చూస్తున్నానని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. ఛాంపియన్‌షిప్‌ ప్రవేశపెట్టడంతో సుదీర్ఘ ఫార్మాట్‌ పట్ల ఆసక్తి పెరిగిందన్నాడు. ఈ రెండేళ్లలో ఉత్కంఠకరమైన టెస్టు సిరీసులను చూడగలిగామని పేర్కొన్నాడు. ఫైనల్స్‌కు మరో నెలరోజులే ఉండటంతో అతడు ఐసీసీతో మాట్లాడాడు.

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న న్యూజిలాండ్‌, భారత్‌ ఐసీసీ టెస్టు ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఇందుకోసం న్యూజిలాండ్‌ ఇప్పటికే ఇంగ్లాండ్‌ చేరుకుంది. ఆతిథ్య జట్టుతో ముందుగా రెండు టెస్టులు ఆడనుంది. మరోవైపు భారత్‌ సైతం ఇంగ్లాండ్‌ పర్యటనకు సిద్ధమైంది. బుధవారం ముంబయిలో జట్టు సభ్యులు, కుటుంబ సభ్యులు ఒక్కచోటికి చేరనున్నారు. అక్కడ క్వారంటైన్‌లో ఉంటారు. సౌథాంప్టన్‌ చేరుకున్నాక అక్కడా కఠిన క్వారంటైన్‌లో ఉంటారు.

‘టెస్టు ఛాంపియన్‌షిప్‌ సరైన ఉద్దేశాన్ని మనం చూడగలిగాం. ఇది సుదీర్ఘ ఫార్మాట్‌పై ఆసక్తి పెంచింది. మనం డిక్లరేషన్లు చూశాం, హోరాహోరీగా తలపడ్డ మ్యాచులూ వీక్షించాం. భారత్‌-ఆస్ట్రేలియా సిరీసు, న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ సిరీసులు ఇందుకు మంచి ఉదాహరణలు. ఫలితాల కోసం జట్లు ఎంతగానో శ్రమించాయి. రిస్క్‌ తీసుకున్నాయి. మేం ఫైనల్‌ ఆడుతున్నందుకు ఆత్రుతగా ఉంది. ఇందులో గెలిస్తే మరింత బాగుంటుంది. టీమ్‌ఇండియాతో ఎప్పుడు తలపడ్డా కఠిన సవాళ్లు ఎదురవుతాయి. వారితో ఆడటం ఎప్పుడూ ఉత్కంఠకరంగానే ఉంటుంది’ అని విలియమ్సన్‌ అన్నాడు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని