close
టాలీవుడ్‌
కథానాయిక దొరికేసిందా?

నందమూరి బాలకృష్ణ - కె.ఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. సి.కల్యాణ్‌ నిర్మాత. ఈ చిత్రానికి ‘రూలర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇద్దరు నాయికలుంటారు. ప్రస్తుతం వారి కోసం అన్వేషణ జరుగుతోంది. ఓ కథానాయికగా పాయల్‌ రాజ్‌పుత్‌ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘ఆర్‌.ఎక్స్‌ 100’తో ఆకట్టుకున్న పాయల్‌కి  వరుసగా అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్‌డీఎక్స్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికీ సి.కల్యాణే నిర్మాత. ఆయనే పాయల్‌కి మరో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈవారంలోనే హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. జూన్‌ నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సంగీతం: చిరంతన్‌ భట్‌


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.