పోలింగ్‌ బూత్‌ నుంచి ఇన్‌స్టా లైవ్‌.. బోగస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు

గుజరాత్‌లోని దాహోద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్‌ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్‌ భాభోర్‌.. పోలింగ్‌ కేంద్ర లోపల నుంచి ఇన్‌స్టా లైవ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది.

Updated : 09 May 2024 06:46 IST

దాహోద్‌: గుజరాత్‌లోని దాహోద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్‌ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్‌ భాభోర్‌.. పోలింగ్‌ కేంద్ర లోపల నుంచి ఇన్‌స్టా లైవ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారంతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో మహిసాగర్‌ పోలీసులు భాభోర్‌ను, మరో వ్యక్తిని బోగస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ అరెస్టు చేశారు. దాహోద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పర్థంపుర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో అతను ఇన్‌స్టా లైవ్‌ చేశాడని, మరో ఇద్దరు ఓటర్ల తరఫున ఓటు వేశాడని చెప్పారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో భాభోర్‌ దానిని డిలీట్‌ చేశాడని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని