‘అందాల రాక్షసి’: ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? - Special story on Lavanya Tripathi birthday
close
Updated : 15/12/2020 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అందాల రాక్షసి’: ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా..’ అంటూ ‘అందాల రాక్షసి’లో అమాయకంగా అడుగుతుంటే ఆ అమ్మాయిని చూసి అందరూ భలే ముచ్చటపడ్డారు. ‘భలే భలే మగాడివోయ్‌’లో మతి మరుపు ప్రేమికుడితో ఇబ్బందులు పడుతూ నవ్వులు పంచి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది లావణ్య త్రిపాఠి. ఆపై ‘సోగ్గాడే చిన్నినాయనా’లో ఏకంగా అగ్ర కథానాయకుడు నాగార్జున సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఆమె వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. మంగళవారం లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..!

* లావణ్య త్రిపాఠి 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది.

* తండ్రి లాయర్‌ కావడంతో వృత్తి జీవితం కోసం కుటుంబమంతా ఉత్తరాఖండ్‌కు వెళ్లింది. దీంతో లావణ్య బాల్యమంతా అక్కడే గడిచింది.

* ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం ముంబయి వెళ్లిన లావణ్య రిషి దయారామ్‌ నేషనల్‌ కాలేజ్‌లో ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. నెమ్మదిగా మోడలింగ్‌పై ఆసక్తి ఏర్పడటంతో అటువైపు అడుగులు వేసింది. పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్‌ షోలలో నటించింది. 2006లో మిస్‌ ఉత్తరాఖండ్‌గా ఎంపికైంది.

* 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రంలో మిథునగా అమాయకపు అమ్మాయిగా తన నటనతో అలరించింది.

* ఆ తర్వాత ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ఇలా వరుస చిత్రాల్లో నటించింది. గతేడాది ఆమె నటించిన ‘అర్జున్‌ సురవరం’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

* ‘గీత గోవిందం’లో కథానాయికగా చేసే అవకాశం ముందుగా లావణ్య త్రిపాఠినే వరించింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని అందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని లావణ్య ఓ సందర్భంలో పంచుకుంది.

* ‘సక్సెస్‌ మంత్ర ఏంటో నాకూ తెలియదు. నిన్ను, నీ ధైర్యాన్ని నువ్వు నమ్ముకో. అదే విధంగా కళను కళగానే చూడాలి. పోటీలా చూడకూడదు’ అని లావణ్య చెబుతుంటుంది.

* ‘‘కథల ఎంపిక విషయంలో వైవిధ్యాన్ని కోరుకుంటా. ఎంచుకునే ప్రతి సినిమాలోనూ మంచి పాత్ర చేశాననే అనుభూతితో పాటు, కొత్తదనమూ ఉండాలి’’

* ‘‘కొన్నిసార్లు విపరీతంగా కోపం వచ్చేస్తుంటుంది. అలాంటి సమయాల్లో కొన్ని ఇబ్బందులు, నష్టాలను ఎదుర్కొన్నా. కోపాన్ని తప్ప నాలో మార్చుకునే అంశం మరేదీ లేదు’’

* తాను నటిని కావడానికి అలనాటి తారలు శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లే స్ఫూర్తి అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

* ప్రస్తుతం సందీప్‌ కిషన్‌తో కలిసి 8‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’లో హాకీ ప్లేయర్‌గా నటిస్తోంది. ఇందుకోసం హాకీ నేర్చుకుంది. దీంతో పాటు, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో నటిస్తోంది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని