close
Published : 17/02/2021 21:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫిఫిఫీ..ఫిఫీ..అంటున్న గాలిసంపత్‌! 

హైదరాబాద్‌: రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గాలి సంపత్‌’. ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేతో పాటు, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రంలోని ‘ఫిఫీ..ఫీఫీ..’అంటూ సరదాగా సాగిపోతున్న సాంగ్‌ లిరికల్‌ వీడియోను నేచురల్ స్టార్‌ నాని విడుదల చేశారు. ‘రాజ రాజశ్రీ గాలి సంపత్‌ గారూ’అంటూ వస్తున్న పల్లవిలో రాజేంద్రప్రసాద్‌ పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమౌతోంది. తండ్రీ కొడుకులుగా రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు తెరపై అలరించనున్నారు. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతాన్ని అచ్చు స్వరాలందించగా రాహుల్‌ నంబియార్‌, శ్రీకృష్ణ ఆలపించారు. ఎస్‌. కృష్ణ కథను అందించి సినిమాను నిర్మిస్తున్నారు. అనీష్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 11 థియేటర్లలో సందడి చేయనుంది.  మరి అప్పటిదాకా ఈ పాటను చూసేయండి!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని