ఆచార్య.. సిద్ధమవుతోంది
close
Updated : 05/08/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆచార్య.. సిద్ధమవుతోంది

థానాయకుడు చిరంజీవి.. దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతోన్న తొలి చిత్రం ‘ఆచార్య’. రామ్‌ చరణ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరుకు జోడీగా కాజల్‌ నటిస్తుండగా.. చరణ్‌ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఇటీవలే ఆఖరి షెడ్యూల్‌ ప్రారంభించుకున్న ఈ సినిమా.. ఇప్పుడు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో చిరు, చరణ్‌ ఓ అడవిలో చెట్టు దగ్గర కూర్చుని కనిపించారు. ‘‘మేం అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా టాకీ పార్ట్‌ పూర్తి చేశాం. ఆగస్టు 20 నుంచి చిరంజీవి - చరణ్‌ల మీద ఓ పాటను, అలాగే చరణ్‌, పూజా హెగ్డేల పైన మరో గీతాన్ని చిత్రీకరిస్తాం. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. చరణ్‌ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఎస్‌.తిరుణ్ణావుక్కరసు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని