కొత్త కాన్సెప్ట్‌తో... ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు’
close
Published : 13/01/2021 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త కాన్సెప్ట్‌తో... ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు’

అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటించిన చిత్రం ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు’. ఎవరు, ఎక్కడ, ఎందుకు...అనేది ఉపశీర్షిక. కె.వి.గుహన్‌ దర్శకుడు. డా.రవి పి.రాజు దాట్ల నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హీరో రానా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘గుహన్‌ విభిన్నమైన ఆలోచనలున్న ఛాయాగ్రాహకుడు. ఆయనతో కలిసి పనిచేశా. తను దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్టర్‌ని చూస్తుంటే ఇదొక హై కాన్సెప్ట్‌ కథ అనిపిస్తోంది. గుహన్‌ ఇలాంటి మరెన్నో సినిమాల్ని తీయాలని
కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘తొలి సినిమా ‘118’ తర్వాత, రెండో సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఓ కొత్త కాన్సెప్ట్‌ ఇది. రానా చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది.’’ అన్నారు.
‘‘తెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కించాం. ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేస్తుందీ చిత్రం’’ అన్నారు నిర్మాత. కార్యక్రమంలో సహనిర్మాత విజయ్‌ ధరన్‌ దాట్ల, నాయకానాయికలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని