కాల్పుల విరమణ అమలు ఎలా? 
close
Updated : 27/03/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాల్పుల విరమణ అమలు ఎలా? 

భారత్‌-పాకిస్థాన్‌ మరోసారి మథనం

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలన్న ఒప్పందం అమలులో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య శుక్రవారం చర్చలు జరిగాయి. పూంచ్‌-రావల్‌కోట్‌ మార్గంలో జరిగిన సమావేశంలో ఇరు దేశాల సైన్యాలకు చెందిన బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు. నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంట కాల్పుల విరమణ కోసం 2003లో కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉందామంటూ గత నెలలో రెండు దేశాల డైరక్టర్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారులు ఓ అవగాహనకు వచ్చారు. దాని కొనసాగింపులో భాగంగానే శుక్రవారం భేటీ జరిగింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించుకున్నారు. మార్చిలో ఒక్క ఘటన మినహా నెలలో ఒక్క తూటా కూడా ఎల్‌ఓసీలో పేలలేదని, గత అయిదారేళ్లలో సరిహద్దుల్లో ఈ స్థాయిలో శాంతి నెలకొనడం ఇదే ప్రథమమని భారత ఆర్మీ చీఫ్‌ ఎం.ఎం.నరవణే గురువారం వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, పాకిస్థాన్‌ వైపు నుంచి ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగానే ఉన్నారని ఆయన తెలిపారు.
శాంతి దీపం నిలిచేనా!
రెండు దేశాల మధ్య శాంతి కోసం పాకిస్థాన్‌ సైన్యం, ఆ దేశ ప్రధాని అందిస్తున్న స్నేహ హస్తంపై పలు ప్రశ్నలు ఉత్ఫన్నమవుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా పాకిస్థాన్‌ శాంతి ప్రతిపాదనలను ఎంత వరకు విశ్వసించవచ్చన్నది వీటిలో ప్రధానమైనది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగిద్దామంటూ రెండు దేశాల సైన్యాలు ఓ అవగాహనకు రావడం గతంలోనూ అనేక మార్లు జరిగిందని, దానిని పాక్‌ ఉల్లంఘించడం పరిపాటిగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, భారత్‌ తగు జాగ్రత్తలు తీసుకుంటూనే పాకిస్థాన్‌తో చర్చల్లో పాల్గొనాలని విదేశీవ్యవహారాల నిపుణులు విష్ణు ప్రకాశ్, మాజీ రాయబారి జితేంద్ర త్రిపాఠి అభిప్రాయపడ్డారు. 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని