షూటింగ్స్‌కి వెళ్లడం లేదు: సునీత - i am not going for shootings now says sunitha
close
Updated : 08/05/2021 14:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షూటింగ్స్‌కి వెళ్లడం లేదు: సునీత

ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన గాయని

హైదరాబాద్‌: కరోనా కారణంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా తాను ప్రస్తుతం షూటింగ్స్‌కి వెళ్లడం లేదని ప్రముఖ గాయని సునీత తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా ప్రస్తుతం తాను ఇంటికే పరిమితమైనట్లు చెప్పారు. చాలారోజుల తర్వాత ఇన్‌స్టా వేదికగా లైవ్‌లోకి వచ్చిన సునీత.. నెటిజన్లు కోరిన సుమధురాలను ఆలపించి ఆకట్టుకున్నారు. కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో..  ప్రతిఒక్కరికీ కొంత సాంత్వన అందించేందుకే తాను ఈ విధంగా లైవ్‌లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఆమె సూచించారు.

లైవ్‌లో భాగంగా ‘గోదావరి’ నుంచి ‘అందంగా లేనా’, ‘రామచక్కని సీతకు’, ‘తమ్ముడు’ నుంచి ‘పెదవిదాటని’తోపాటు తెలుగు, తమిళం, కన్నడ పాటలను ఆమె పాడి వినిపించారు. అనంతరం ఎస్పీబాలు గురించి మాట్లాడుతూ.. ‘పాడిన ప్రతి పాట, ఆసమయంలో చోటుచేసుకున్న ప్రతి విషయం ఆయనకు గుర్తుందంటే దానర్థం.. ఆయన ప్రతి క్షణం పాటలోనే జీవించారు. పాటల్నే ప్రేమించారు’ అని సునీత కొనియాడారు. అలాగే చిత్ర.. భారతదేశంలోనే గొప్ప గాయని అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘నేనున్నానని’ పాట పాడి.. దానిని వైద్యులు, ఇతర ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి అంకితం చేస్తున్నట్లు వివరించారు. ఇకపై ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని ఆమె తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని