సూరిబాబు.. ఓల్టేజ్‌ ఎక్కువే
close
Published : 12/05/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూరిబాబు.. ఓల్టేజ్‌ ఎక్కువే

‘ఇక్కడున్నది లైటింగ్‌ సూరిబాబు కదా... కొంచెం ఓల్టేజ్‌ ఎక్కువే’ అంటున్నాడు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ‘పలాస 1978’తో ప్రేక్షకుల్ని మెప్పించిన కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎమ్‌.ఎమ్‌.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మంగళవారం సుధీర్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. గోదావరి నేపథ్యం, సూరిబాబు లైటింగ్‌, అతని ఫైటింగ్‌తో కూడిన వీడియో ఆకట్టుకునేలా ఉంది. అందులో సుధీర్‌బాబు సిక్స్‌ప్యాక్‌ దేహంతో చేస్తున్న సందడీ ఆకట్టుకుంది. ‘‘సుధీర్‌బాబుని ఈ చిత్రంలో కొత్త కోణంలో చూస్తారు.ఇందులోని పాత్రలన్నీ అదే తరహాలో ఉంటాయి. శ్యామ్‌ దత్‌ విజువల్స్‌, మణిశర్మ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగానిలుస్తాయి. విడుదలైన ప్రచార చిత్రానికి సామాజిక మాధ్యమాల్లో చక్కటి స్పందన లభిస్తోంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. కథ: నాగేంద్రకాశీ, కూర్పు; శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రామకృష్ణ - మౌనిక.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని