‘అవతార్‌’ సిరీస్‌ల్లో విన్‌ డీజిల్‌
close
Updated : 18/06/2021 04:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అవతార్‌’ సిరీస్‌ల్లో విన్‌ డీజిల్‌

‘అవతార్‌-2’ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనక్కర్లేదు. ఇప్పుడిందులో మరో విశేషం ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీస్‌ చిత్రాల ద్వార ప్రపంచ సినీ అభిమానుల ఆదరణ పొందిన హాలీవుడ్‌ నటుడు విన్‌ డీజిల్‌ ‘అవతార్‌’ సిరీస్‌లో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆయన ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘జేమ్స్‌ కామెరూన్‌ నాకు అత్యంత ఇష్టమైన దర్శకుడు. ఆయనతో పనిచేయడం కంటే అదృష్టం ఇంకేం కావాలి. ఇప్పుటికి ఆయనతో చర్చలు మాత్రమే జరిపాను. త్వరలో ఆయనతో కలిసి పనిచేస్తాను.’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అవతార్‌-2, 3 చిత్రాలు తుది దశ చిత్రీకరణలో ఉన్నాయి. విన్‌ డీజిల్‌ మాటలను బట్టి ఆయన అవతార్‌-2లో అతిథిపాత్రలో మెరుస్తారా? లేక అవతార్‌-3లో పూర్తిస్థాయి పాత్ర పోషిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ‘అవతార్‌-2’లో జో సాల్డనా, సామ్‌ ఓర్తింగ్‌టన్‌, కేట్‌ విన్‌స్లేట్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని