శార్దూల్‌కు దక్కని చోటు    
close
Updated : 16/06/2021 04:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శార్దూల్‌కు దక్కని చోటు    

సిరాజ్‌, విహారిలకు అవకాశం
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు 15 మందితో భారత జట్టు

సౌథాంప్టన్‌: తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా చారిత్రక టెస్టు సిరీస్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్‌బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడబోయే భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం 15 మందితో జట్టును భారత్‌ ప్రకటించింది. శార్దూల్‌ను పక్కన పెట్టి సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌నే జట్టు యాజమాన్యం ఎంచుకుంది. ఇంగ్లాండ్‌కు వెళ్లిన జంబో బృందంలో సభ్యులైన రాహుల్‌, మయాంక్‌్, సుందర్‌లకు కూడా జట్టులో చోటు లభించలేదు. హైదరాబాదీ ఆటగాళ్లు సిరాజ్‌, హనుమ విహారిలిద్దరూ అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు ఫైనల్‌కు న్యూజిలాండ్‌ సైతం 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.
భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), గిల్‌, రోహిత్‌, పుజారా, రహానె, పంత్‌, అశ్విన్‌, జడేజా, షమి, బుమ్రా, ఇషాంత్‌, సిరాజ్‌, సాహా, ఉమేశ్‌, విహారి.
న్యూజిలాండ్‌ జట్టు: విలియమ్సన్‌, లేథమ్‌, బ్లండెల్‌, కాన్వే, యంగ్‌, రాస్‌ టేలర్‌, నికోల్స్‌, వాట్లింగ్‌, గ్రాండ్‌హోమ్‌, వాగ్నర్‌, హెన్రీ, బౌల్ట్‌, సౌథీ, జేమీసన్‌, అజాజ్‌ పటేల్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని