వీళ్లు స్ఫూర్తిదాయకం - katrina kaif shares pic on mothers day
close
Published : 10/05/2021 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీళ్లు స్ఫూర్తిదాయకం

ఇంటర్నెట్‌డెస్క్‌: మాతృదినోత్సవం వేళ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా సినీ తారలు వాళ్ల మాతృమూర్తులతో కలిసి దిగిన ఫొటోలు, వాళ్లతో ఉన్న   జ్ఞాపకాలే కనిపించాయి. బాలీవుడ్‌ భామ కత్రినాకైఫ్‌ మాత్రం తన తల్లితో ఉన్న ఫొటోను కాకుండా కొత్తగా రీతిలో మాతృదినోత్సవ శుభాకాంక్షలు   తెలిపింది. డాక్టర్, పైలెట్, పోలీస్, హోమ్‌ చెఫ్, మెంటల్‌ హెల్త్‌ డాక్టర్‌...ఇలా ఐదు రంగాల్లో విశేష సేవలందిస్తున్న మాతృమూర్తుల విశేషాలను పంచుకుంది. కరోనా సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి ధైర్యంగా సేవలందిస్తున్న వీళ్ల సేవలను కొనియాడుతూ వాళ్ల ఫొటోలను పంచుకుంది కత్రిన.

ఓ పక్క తల్లి బాధ్యతను గొప్పగా నిర్వర్తిస్తూనే వృత్తిపరంగానూ సత్తా చాటుతున్న ఇలాంటి తల్లులు అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ పోస్ట్‌లు పెట్టింది కత్రినా. ఆ ఐదుగురిలో డాక్టర్‌ స్నిగ్ధ గోయల్, పైలెట్‌ ప్రియా చౌహాన్, పోలీస్‌ అధికారిణి సునయన సుభోద్, చెఫ్‌ హీనా మాండవియా, మానసిక వైద్యురాలు డాక్టర్‌ మిల్‌ షా ఉన్నారు. మదర్స్‌డే రోజున కత్రినా స్పందించిన తీరుకి నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని