Naga Shaurya: కండ కలిగితే..కథానాయకుడోయ్‌ - naga shaurya new look
close
Published : 16/06/2021 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Naga Shaurya: కండ కలిగితే..కథానాయకుడోయ్‌

హైదరాబాద్‌: ‘కసి కలిగితే... కథ గలదోయ్‌..! కండ కలిగితే.. కథానాయకుడోయ్‌..!!’’ అంటున్నాడు నాగశౌర్య. గతంలో నాగశౌర్య అనగానే కామ్, హోమ్లీ,   లవర్‌బాయ్‌ లుక్‌లే గుర్తొచ్చేవి. ఇప్పుడు తన ‘లక్ష్య’ కోసం దీక్షగా కసరత్తులు చేస్తున్నాడు. ధీరేంద్ర సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లక్ష్య’.. ఆర్చురీ నేపథ్యంలో సాగే కథ. దీనికోసం తన దేహదారుఢ్యాన్ని పూర్తిగా మార్చేశాడు నాగశౌర్య. కరోనా విరామంతో దాన్ని మరింతగా రాటుదేల్చాడు. తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. ఈ నేపథ్యంలోనే జిమ్‌లో కసరత్తులు చేస్తున్న తన కొత్త ఫొటోను అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈయన ‘వరుడు కావలెను’, ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని