Nani: ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల కోసం ‘దారే లేదా’ - nani dedicate dhaare lede video song for front line workers starring satya dev
close
Published : 15/06/2021 21:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nani: ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల కోసం ‘దారే లేదా’

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల కోసం ఓ స‌ర్‌ప్రైజ్ ఇస్తున్న‌ట్టు న‌టుడు నాని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన వివ‌రాల్ని ఆయ‌న సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా పంచుకున్నారు. కొవిడ్ వేళ అనేకమంది ప్రాణాల్ని ర‌క్షిస్తున్న ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లకి బ‌హుమ‌తిగా ‘దారే లేదా’ అనే వీడియో గీతాన్ని రూపొందించినట్టు తెలిపారు. విజ‌య్ బుల్గ‌నిన్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన‌ ఈ పాట‌కి కె.కె. సాహిత్యం అందించారు. న‌టులు స‌త్య‌దేవ్‌, రూప (ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య ఫేం) ఈ గీతంలో క‌నిపించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ వీడియో విడుద‌ల కానుంది. వాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై నాని స‌మ‌ర్పణ‌లో తెలుగు, త‌మిళ భాషల్లో రూపొందింది ఈ గీతం. 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని