ఇంటర్నెట్డెస్క్: ప్రియాంక చోప్రా దృష్టంతా ఇప్పుడు హాలీవుడ్పైనే ఉంది. ఆమెలో మంచి నటే కాదు గాయనీ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో పలు ప్రత్యేక వీడియో గీతాల్ని విడుదల చేసింది. ‘ఇన్ మై సిటీ’ అనే వీడియో గీతంతో గాయనిగా మారిన ప్రియాంక ఆ తర్వాత ‘ఎక్జోటిక్’, ‘ఐ కాంట్ మేక్ యు లవ్ మి’ గీతాలతో అలరించింది. ఇప్పుడు ఎలాగూ తన భర్త నిక్ సంగీత ప్రపంచంలో అనుభవం ఉన్నవాడే కాబట్టి మళ్లీ గాయనిగా మారడానికి ప్రియాంక ఆసక్తి చూపిస్తుందా? అంటే లేదు అనే సమాధానమే ఆమె నుంచి వినిపిస్తోంది. ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది ప్రియాంక.
‘‘నిక్ సంగీతంలో నిష్ణాతుడు. ఇప్పుడు ఆయనతో కలిసి పాడి నా ఇమేజ్ పెంచుకోవాలి అనుకోవడం లేదు. సంగీతం అనే అధ్యాయాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే ముగించాను. ఇప్పుడు మళ్లీ దాని జోలికి వెళ్లే తీరిక లేదు. అంతకంటే ప్రాధాన్యం ఉన్న విషయాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా నటన, చిత్ర నిర్మాణం మీదే’’అని చెప్పింది ప్రియాంక. ఆమె ప్రస్తుతం లండన్లో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చిత్రీకరణలో ఉంది. నెట్ఫ్లిక్స్ కోసం ఆమె చేస్తున్న సిరీస్ ఇది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’