మున్నీలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నా - salman khan starred bajarangi bhaijaan actress harshaali malhotra first intervew as an teenager
close
Published : 14/06/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మున్నీలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నా

ఇంట‌ర్నెట్ డెస్క్: ‘బ‌జ‌రంగీ భాయిజాన్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది హ‌ర్షాలీ మ‌ల్హోత్రా. స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో బాల న‌టిగా మున్నీ పాత్ర పోషించి ఔరా అనిపించింది.  ఇటీవ‌ల టీనేజీలోకి అడుగుపెట్టిన‌ హ‌ర్షాలీ తాజాగా ఓ ప్ర‌ముఖ ఆంగ్ల మీడియాతో ముచ్చ‌టించింది. త‌న ఇష్టాలు, సినిమా అవకాశాల గురించి చెప్పుకొచ్చింది. ఆ విశేషాలివీ..

* స‌ల్మాన్ ఖాన్ కాకుండా మీకు బాగా న‌చ్చిన బాలీవుడ్ హీరోలు?

అక్ష‌య్ కుమార్‌, ర‌ణ్‌వీర్ సింగ్‌.

* హీరోయిన్ల‌లో ఎవ‌రంటే ఇష్టం?

కరీనా క‌పూర్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌.

* మీ సినిమా కాకుండా మీరు మెచ్చే చిత్రాలు?

ప‌ద్మావ‌త్‌, హౌస్‌ఫుల్‌.

*  మీకు ఇష్ట‌మైన స‌బ్జెక్టులు?

ఇంగ్లిష్ నాకు న‌చ్చిన స‌బ్జెక్టు. న‌చ్చ‌ని స‌బ్జెక్టు: చ‌రిత్ర.

* హ‌ర్షాలీ.. సల్మాన్ ఖాన్‌తో ట‌చ్‌లో ఉంటుందా?

త‌ప్ప‌కుండా. ఆయ‌న పుట్టిన రోజు, పండ‌గల రోజున స‌ల్మాన్ ఖాన్‌తో మాట్లాడతా.

* మీ సోష‌ల్ మీడియా ఖాతాలు ఎవ‌రు హ్యాండిల్ చేస్తుంటారు?

మా అమ్మ‌.

* త‌ర్వాతి ప్రాజెక్టు ఏంటి?

‘బ‌జ‌రంగీ భాయిజాన్’ చిత్రం త‌ర్వాత నాకు చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ, నేను మున్నీలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని