close
Published : 02/04/2021 16:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలరిస్తోన్న తలైవి ‘ఇలా ఇలా’ గీతం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని ‘ఇలా ఇలా’ అంటూ సాగే గీతాన్ని (ఫుల్‌ వీడియో) నాయిక సమంత తాజాగా విడుదల చేశారు. కంగనా రనౌత్‌ హావభావాలు, లొకేషన్‌ ఆకట్టుకుంటున్నాయి. సిరా శ్రీ రచించిన ఈ పాటని సైందవి ప్రకాశ్‌ చక్కగా ఆలపించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి, కరుణానిధి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ దర్శనమివ్వబోతున్నారు. శశికళగా పూర్ణ కనిపించనుంది. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని