
హైదరాబాద్: ఒకవైపు కరోనా పరిస్థితులు చక్కబడుతుండటం, మరోవైపు వ్యాక్సిన్ వస్తుండటంతో నెమ్మదిగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. సంక్రాంతి కానుకగా పలు తెలుగు సినిమాలు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అయినా, కొన్ని చిత్రాలు ఓటీటీకే మొగ్గు చూపుతున్నాయి. నాగార్జున కథానాయకుడిగా అహిషోర్ సాల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని ఇచ్చి హక్కులు పొందినట్లు సమాచారం. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా దీన్ని విడుదల చేయనున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాగార్జున ఇందులో ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఆయనతో పాటు, సయామీఖేర్, దియా మీర్జా, అతుల్ కుల్కర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి