రకుల్‌ విషయంలో షాకయ్యా: నితిన్‌ - nithiin about check movie
close
Published : 20/02/2021 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రకుల్‌ విషయంలో షాకయ్యా: నితిన్‌

హైదరాబాద్‌: వరుస కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూ దక్షిణాది అగ్రకథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు సంబంధించి ఓ విషయంలో తాను షాక్‌కు గురయ్యానని కథానాయకుడు నితిన్‌ అన్నారు. నితిన్‌, రకుల్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘చెక్‌’. ‘ఐతే’, ‘సాహసం’ లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన చంద్రశేఖర్‌ యేలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘చెక్‌’ ప్రమోషన్స్‌లో నటీనటులు బిజీగా పాల్గొంటున్నారు.

ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్‌ని దర్శకుడు వెంకీ అట్లూరి సరదాగా కాసేపు ఇంటర్వ్యూ చేశారు. తన కెరీర్‌లోనే ‘చెక్‌’ ఓ విభిన్న కథా చిత్రమని.. 80శాతం సినిమా జైలులోనే ఉంటుందని నితిన్‌ తెలిపారు. అంతేకాకుండా ఇందులోని పాత్ర కోసం మానసికంగా కూడా సిద్ధమయ్యానని.. అందువల్ల ప్రతిరోజూ షూట్‌ అయ్యాక కూడా అదే ఆలోచనలతో, విచారంగా ఉండేవాడని.. దాంతో కొన్నిరోజులపాటు తన సతీమణి షాలిని కూడా.. ‘ఆయనకు ఏమైంది?ఎందుకు విచారంగా ఉన్నారా?’ అనే ఆలోచనల్లో పడిందని ఆయన వివరించారు.

అనంతరం తన సహనటీమణుల గురించి మాట్లాడుతూ.. ‘ప్రియా ప్రకాశ్‌కు తెలుగులో ఇదే మొదటి సినిమా. 30 నిమిషాలు మాత్రమే ఆమె స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక, రకుల్‌ విషయానికి వస్తే.. తను ఓ కమర్షియల్‌ హీరోయిన్‌. ఇందులో తను లాయర్‌లా కనిపించనుంది. తన క్యారెక్టర్‌ చాలా కొత్తగా, హుందాతనంగా ఉంటుంది. ఒక కమర్షియల్‌ హీరోయిన్‌ అయి ఉండి.. పాటలు, రొమాన్స్‌లు ఉండవని తెలిసి కూడా.. కథ చెప్పిన వెంటనే చేయడానికి రకుల్‌ ఓకే చేయడం చూసి నేను షాక్‌ అయ్యాను’ అని నితిన్‌ వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని