నెట్టింట్లో షేర్ చేసిన హాస్యనటుడి సతీమణి
హైదరాబాద్: ప్రాణస్నేహితులు పవన్‌కల్యాణ్, ఆలీ తాజాగా ఒకస్టేజ్పై కలిసి కనిపించారు. కొద్దిసమయంపాటు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అగ్రకథానాయకుడు పవన్‌కల్యాణ్, హాస్యనటుడు ఆలీ ఎంతో కాలం నుంచి ఆప్త మిత్రులనే విషయం తెలిసిందే. అందుకే, పవన్ నటించిన చాలా సినిమాల్లో ఆలీ ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాల తర్వాత వీరిద్దరూ ఉన్న ఫొటోలు ఏమీ బయటకు రాలేదు.
కాగా, రెండురోజుల క్రితం ఆలీ బంధువుల నివాసంలో ఓ వివాహం జరిగింది. ఈ వేడుకలకు ఇటు ఆలీ కుటుంబంతోపాటు అటు పవన్‌కల్యాణ్ కూడా హాజరయ్యారు. వధూవరులకు అభినందనలు తెలిపిన అనంతరం పవన్‌కల్యాణ్‌తో ఆలీ, ఆయన సతీమణి సెల్ఫీ తీసుకున్నారు. అంతేకాకుండా ఆలీ.. పవన్‌తో నవ్వుతూ మాట్లాడడం.. పవన్ కూడా సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోను ఆలీ సతీమణి జుబేదా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు ఎంతో సంతోషిస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్‌కల్యాణ్.. మలయాళీ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌లో బిజీగా పాల్గొంటున్నారు. దీనితోపాటు ఆయన క్రిష్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి మాత్రమే కాకుండా పవన్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మరోవైపు ‘వకీల్‌సాబ్’ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ