close
Published : 22/04/2021 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Radhe: మోస్ట్‌ వాంటెడ్‌ ట్రైలర్‌ వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. మాదక ద్రవ్యాల గురించి చెప్పే సన్నివేశంతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరిస్తుంది. సల్మాన్‌ విభిన్న గెటప్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నారు. సంభాషణలు, డ్యాన్సులతో అదరగొడుతున్నారు. తెలుగులో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలోని సీటీమార్‌ రీమేక్‌ గీతంలో దిశా పటానీ, సల్మాన్‌ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరో అందం జాక్వెలిన్‌ ప్రత్యేక గీతంలో కనిపించి సందడి చేసింది.

ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 13న విడుదల కానుంది. థియేటర్లతో పాటు ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో జీ ప్లెక్స్‌, డిష్‌ టీవీ, డీటుహెచ్‌, టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీల్లోనూ ‘రాధే’ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని