SarkaruVaari Paata: సోషల్‌ మీడియాలో దూసుకుపోతున్న మహేశ్‌ పోస్టర్‌ - sarkaruvaari paata is now the fastest 100k liked poster in tfi
close
Published : 02/08/2021 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SarkaruVaari Paata: సోషల్‌ మీడియాలో దూసుకుపోతున్న మహేశ్‌ పోస్టర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. శనివారం ఈ చిత్రానికి సంబంధించి ‘ఫస్ట్‌ నోటీస్‌’ అంటూ ఈ సినిమాలోని మహేశ్‌లుక్‌ను పంచుకుంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా మహేశ్‌లుక్ అలరిస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్‌ సోషల్‌మీడియాలో ట్రెడింగ్‌లో ఉంది. గతంలో ఏ హీరో పోస్టర్‌కు లభించని స్థాయిలో ఆదరణ లభిస్తోందని చిత్ర బృందం తెలిపింది. అతి తక్కువ సమయంలోనే అత్యధికంగా 100K లైక్స్‌ సాధించిన పోస్టర్‌గా ‘సర్కారువారి పాట’ నిలిచిందని వివరించింది.

పొడవాటి జుట్టు, మెడపై రూపాయి కాయిన్‌ టాటూతో ఎరుపు రంగు కారులోని నుంచి మహేశ్‌ స్టైల్‌గా దిగుతున్న ఈ ఫొటో అభిమానులను విశేషంగా అలరిస్తోంది. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను పరుశురామ్‌ తీర్చిదిద్దుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘సర్కారువారి పాట’చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని