మరో కుంభకోణంపై స్కామ్ 1992 సీజన్-2
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన హర్షద్‌మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్‌సిరీస్ ‘స్కామ్ 1992’. స్టాక్ మార్కెట్ కుంభకోణం నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. గతేడాది ఈ సిరీస్ ఎంతలా అలరించిందో అందరికీ తెలిసిందే. హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు. కాగా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం కథను ఈసారి తెర మీద చూపించనున్నారు. స్కామ్ 1992 రెండవ సీజన్‌గా ‘స్కామ్2003: ది క్యూరియస్ కేస్ ఆఫ్ అబ్దుల్ కరీమ్ తెల్గీ’ని తీసుకురాబోతున్నాంటూ ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ తెలిపింది.
ఈ నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం 2003లో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో అబ్దుల్ కరీం తెల్గీ అనే వ్యక్తి విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయాలు కూడబెట్టినట్లు తేలింది. కుంభకోణం విలువ దాదాపు రూ.20వేల కోట్లు ఉంటుందని అంచనా. సంజయ్‌సింగ్ అనే జర్నలిస్టు అప్పట్లో ఈ మోసాన్ని బహిర్గతం చేశారు. ‘రిపోర్టర్ కి డైరీ’ అనే పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం ఆధారంగానే ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారట. కర్ణాటకలోని ఖానాపూర్ నుంచి వచ్చిన ఓ సాదాసీదా వ్యక్తి ఇంత తెలివిగా ఎలా ఆలోచించగలిగాడు..? అంత సులువుగా అందర్నీ ఎలా మోసం చేశాడు..? అనేదే ఈ వెబ్‌సిరీస్ కథాంశం. ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తిచేసి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. కాగా ఈ సిరీస్‌లో కనిపించనున్న నటీనటుల గురించి ఇంకా ప్రకటించలేదు. కాగా.. స్కామ్ 1992లో ప్రధాన పాత్ర పోషించిన ప్రతీక్గాంధీకి ఆ వెబ్‌సిరీస్ ఒక మైలురాయిలా నిలిచింది. అందుకే.. ఈ సీజన్2లో అబ్దుల్ కరీంగా ఎవరిని చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
కన్నీటితో ఎదురుచూస్తున్న అదితి
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
-
#ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్