MAA Elections: ‘మా’ ఎన్నికల బరిలోకి రఘుబాబు - telugu news actor raghubabu contest in maa election
close
Updated : 18/09/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ‘మా’ ఎన్నికల బరిలోకి రఘుబాబు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్‌ 10న జరగనున్న ఈ ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ పోటాపోటీగా తలపడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ని ప్రకటించగా.. తాజాగా విష్ణు ప్యానల్‌ నుంచి ఓ కీలక నటుడి పేరు బయటకు వచ్చింది. నటుడు రఘుబాబు ప్రధాన కార్యదర్శి పదవి కోసం విష్ణు ప్యానల్‌ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయన జనరల్‌ సెక్రటరీగా విజయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు, జనరల్‌ సెక్రటరీ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని