Samantha: పూజాహెగ్డే స్థానాన్ని భర్తీ చేస్తోన్న సామ్‌..! - telugu news pooja hegde replaces samantha in ssmb28
close
Updated : 25/11/2021 10:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: పూజాహెగ్డే స్థానాన్ని భర్తీ చేస్తోన్న సామ్‌..!

డేట్సా లేక క్రియేటివ్‌ డిఫరెన్సెస్సా..?

హైదరాబాద్‌: ‘అల.. వైకుంఠపురములో..’ విజయం తర్వాత దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ప్రాజెక్ట్‌లు దక్కించుకొన్నారు బుట్టబొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde). దీంతో కొత్త ప్రాజెక్ట్‌లకు డేట్స్‌ సర్దుబాటు చేయడంలో ఆమె సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ స్టార్‌హీరో సినిమాని ఆమె చేజార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ పూజా వదులుకున్న ఆ ప్రాజెక్ట్‌ ఏమిటంటే.. #SSMB28. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Maheshbabu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram) కాంబినేషన్‌లో ఓ సరికొత్త ప్రాజెక్ట్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఈ ప్రాజెక్టులో మహేశ్‌కు జోడీగా తొలుత పూజాహెగ్డేను ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్‌’, ‘సర్కస్‌’ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఆమె డేట్స్‌ సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు మొదట వార్తలు వెలువడ్డాయి. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ తలెత్తడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారని తాజాగా నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. దీంతో, చిత్రబృందం ఆమె స్థానంలో సమంతను(Samantha) తీసుకోవాలనే ఆలోచనలో ఉందట. ఈ మేరకు టీమ్‌ ఇప్పటికే సామ్‌ను సంప్రదించగా.. ఆమె పచ్చజెండా ఊపినట్లు సమాచారం. మరోవైపు, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్తలే కనుక నిజమైతే.. ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేశ్‌-సామ్‌ కాంబినేషన్‌లో రానున్న నాలుగో చిత్రం ఇది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని