Crime news: ఇంటిపై పిడుగుపడి రూ.20లక్షల నగదు, బంగారం దగ్ధం - telugu news the house was burnt by lightning
close
Published : 19/09/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime news: ఇంటిపై పిడుగుపడి రూ.20లక్షల నగదు, బంగారం దగ్ధం

చింతలపూడి: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో శనివారం సాయంత్రం ఓ ఇంటిపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో కాళ్ల కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో ఉన్న రూ.20లక్షల నగదు దగ్ధమైందని బాధితులు చెబుతున్నారు. తమ కుమారుడి చదువు కోసం ఇటీవల పొలం విక్రయించగా వచ్చిన రూ.20లక్షల నగదు ఇంట్లో ఉంచామని, పిడుగు పడటంతో నగదు మొత్తం మంటల్లో కాలిపోయాయని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. నగదుతో పాటు ఇంట్లో ఉన్న 50కాసుల బంగారం కూడా దగ్దమైందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని