close
Published : 18/02/2021 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆగస్టులో కలుద్దాం: తమన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుల సినిమా ప్రకటించడమే ఆలస్యం అంచనాలు భారీగా పెరుగుతుంటాయి. పాటలు ఎలా ఉంటాయి? కథేంటి? కథానాయిక ఎవరు? అంటూ అన్వేషిస్తుంటారు సినీ అభిమానులు. కొత్త అప్‌డేట్‌ కావాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయా చిత్రాలకు పనిచేస్తున్న సాంకేతిక బృందాన్ని అడుగుతుంటారు. తాజాగా ‘సర్కారు వారి పాట’ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న తమన్‌కి ఇదే పరిస్థితి ఎదురైంది. మహేశ్‌ బాబు కథానాయకుడుగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. కీర్తి సురేశ్‌ నాయిక. తమన్‌ని ఈ సినిమా గురించి ఏమైనా సమాచారం ఇవ్వమని ఓ అభిమాని ట్వీట్‌ చేశారు. ‘సర్కారు వారి పాట సినిమా విడుదలకు చాలా సమయం ఉంది. గతంలో వచ్చిన ఆల్బమ్స్‌కి మించి ఉండబోతుంది. అది మాత్రం ఫిక్స్‌. ఆగస్టులో కలుద్దాం’ అని సమాధానం ఇచ్చారు తమన్‌. దీన్ని బట్టి చూస్తుంటే ఈ చిత్రానికి సంబంధించి తొలిపాట ఆగస్టులో విడుదలకావచ్చు. 

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో సాగే కథ అని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. 2021 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని