చార్లెస్‌ ప్రయత్నానికి ఫిదా కావాల్సిందే! - uganda boy charles sings telugu songs
close
Published : 12/06/2021 23:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చార్లెస్‌ ప్రయత్నానికి ఫిదా కావాల్సిందే!

తెలుగు పాటలతో మెప్పిస్తున్న ఉగాండా కుర్రాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: చదువు నిమిత్తం భారత్‌కు వచ్చి.. తెలుగు భాషపై ఉన్న అభిమానంతో ఇక్కడి సినిమాల్లోని పాటల్ని ఆలపించి ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తున్నాడు ఉగాండాకు చెందిన చార్లెస్‌. ఉన్నత చదువుల నిమిత్తం భారత్‌కు వచ్చిన అతను ప్రస్తుతం వరంగల్‌ నిట్‌ క్యాంపస్‌లో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు భాషపై ఉన్న మక్కువతో ఇటీవల విడుదలైన కొన్ని తెలుగు సినిమాల్లోని పాపులర్‌ పాటల్ని పాడి.. వాటిని తన సోషల్‌మీడియా ఖాతాల వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు.

అతని వీడియోలు చూసిన నెటిజన్లు.. తెలుగు పలకడం సరిగ్గా రాకపోయినా సరే నేర్చుకుని మరీ, అతను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో గతవారం పాల్గొన్న చార్లెస్‌.. తనకి సెలబ్రిటీ కావాలనే ఆశ ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా తనకి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, తారక్‌, బన్నీ, ప్రభాస్‌ అంటే అభిమానమని తెలిపారు. ఈ నేపథ్యంలో చార్లెస్‌ పాడిన కొన్ని పాటలు మీకోసం...

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని