close

తాజావార్తలు

హీరో సందీప్‌ కిషన్‌కు గాయాలు

కర్నూలు: మొన్న వరుణ్‌తేజ్‌.. నిన్న నాగశౌర్య.. నేడు సందీప్‌ కిషన్‌ తెలుగు చిత్ర పరిశ్రమలోని నటులు వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమా చిత్రీకరణలో భాగంగా శనివారం సందీప్‌కిషన్‌ గాయపడ్డారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూలులో షూటింగ్‌ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ సన్నివేశంలో సందీప్‌ గాయపడ్డారు. వెంటనే యూనిట్‌ సభ్యులు ఆయన్ను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైట్‌ మాస్టర్‌ సమన్వయ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర బృందం తెలిపింది. ప్రాథమిక చికిత్స అనంతరం సందీప్ కిషన్‌ను కర్నూలు నుంచి హైదరాబాద్ తరలించారు.

కాగా, శుక్రవారం సందీప్‌ కిషన్‌ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ చిత్రీకరణలో భాగంగా బస్సులో నుంచి కిందపడే సన్నివేశానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను షేర్‌ చేశారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.