
తాజావార్తలు
ముంబయి: ‘అక్టోబర్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన పంజాబి సంతతికి చెందిన బ్రిటన్ నటి బనిత్ సంధూ. ప్రస్తుతం ఆమె విక్రమ్ కుమారుడు ధ్రువ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఆదిత్య వర్మ’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో విజయవంతమైన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి రీమేక్ ఇది. గిరీశాయా దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ నటి మరో బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. సుజీత్ సర్కార్ దర్శకత్వంలో రూపుదిద్దుకొనే ‘సర్దార్ ఉద్దమ్ సింగ్’ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు.
గతంలో దర్శకుడు సుజీత్ సర్కార్‌తో ‘అక్టోబర్’ సినిమాలో వరుణ్ ధావన్‌కి జంటగా నటించింది. ఈ చిత్రం విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నా, బాక్సాఫీసు దగ్గర విజయవంతం కాలేకపోయింది. తరువాత బాలీవుడ్లో నటించే అవకాశం లభించలేదు. అయితే తాజా అవకాశం గురించి సంధూ మాట్లాడుతూ.. ‘‘సర్దార్ ఉద్దమ్ సింగ్’ జీవితాధారంగా వస్తున్న చిత్రంలో చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటికే కొన్ని సన్నివేశాలను పంజాబ్ ప్రాంతంలో చిత్రీకరించారు. మరోసారి ‘అక్టోబర్’ దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.’ అని అన్నారు.