ఫాదర్‌ స్టాన్‌ స్వామికి 23 వరకు రిమాండ్‌

తాజా వార్తలు

Published : 09/10/2020 22:59 IST

ఫాదర్‌ స్టాన్‌ స్వామికి 23 వరకు రిమాండ్‌

దిల్లీ: భీమా కోరేగావ్ కేసులో మరో మానవహక్కుల కార్యకర్త అరెస్టయ్యారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి(83)ని ఎన్‌ఐఏ అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని శుక్రవారం ముంబయిలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆయనను విచారించిన న్యాయస్థానం 83 ఏళ్ల స్టాన్‌ స్వామికి ఈ నెల 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీకి ఆదేశించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. ఆదివాసీల హక్కుల కోసం పనిచేస్తున్న స్టాన్‌ స్వామి నివాసానికి నిన్న రాత్రి దిల్లీ నుంచి ఎన్‌ఐఏ ప్రత్యేక బృందం చేరుకుంది. అనంతరం ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిన్న రాత్రి అరెస్టు చేసింది. నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు ఆరోపిస్తున్నారు. భీమా కోరేగావ్ కేసులో అరెస్టైన రోనా విల్సన్, అరుణ్ ఫెరారియ, వరవరరావు, సుధా భరద్వాజ్‌ సహా మరికొంత మందితో స్టాన్ స్వామికి సంబంధాలు ఉన్నట్లు తేలిందని పేర్కొంటున్నారు.

గత కొన్నేళ్లుగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న ఆయన్ను ఎలాంటి వారెంట్‌ లేకుండా అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టాన్‌ స్వామిని అరెస్టు చేయడానికి ముందు దాదాపు 20 నిమిషాల పాటు ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేసినట్టు సమాచారం. అలాగే, ఆయన ఇంట్లో సీపీఐ(మావోయిస్టు) పార్టీకి చెందిన ప్రచార సామగ్రి, సాహిత్యం కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని