కెమికల్‌ డబ్బాలు పేలి తండ్రీకొడుకులు మృతి

తాజా వార్తలు

Published : 04/09/2020 01:32 IST

కెమికల్‌ డబ్బాలు పేలి తండ్రీకొడుకులు మృతి

ఒకరికి తీవ్ర గాయాలు

గన్నవరం గ్రామీణం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్లైవుడ్‌ కంపెనీలో ఖాళీ కెమికల్‌ డబ్బాలు పేలడంతో ఇద్దరు మృతిచెందారు. జయరాజ్‌ ప్లైవుడ్‌ కంపెనీలో ఈ ఘటన జరిగింది. తుక్కు కొనుగోలు చేసేందుకు వచ్చిన తండ్రీ కొడుకులు తమ ఆటోలోకి ఖాళీ కెమికల్‌ డబ్బాలను ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ ప్రాణాలు కోల్పోవడం అక్కడున్నవారిని కలచివేసింది. మృతులను విజయవాడ రూరల్‌లోని కండ్రిక గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని