బంజారాహిల్స్‌లో విద్యుత్‌షాక్‌తో వైద్యుడి మృతి

తాజా వార్తలు

Published : 15/10/2020 01:17 IST

బంజారాహిల్స్‌లో విద్యుత్‌షాక్‌తో వైద్యుడి మృతి

జూబ్లీహిల్స్‌: హైదరాబాద్‌ నగరాన్ని వర్షం అతలాకుతలం చేస్తోంది. సెల్లార్‌లో నిండిన వర్షపు నీటిని మోటారు సహాయంతో తోడేందుకు యత్నించిన ఓ వైద్యుడు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీనగర్‌ కాలనీ ప్రాంతంలోని ఎస్‌బీహెచ్‌ కాలనీలో సతీశ్‌రెడ్డి అనే వైద్యుడు నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆయన నివసించే అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ నీటితో నిండిపోయింది.  దీంతో ఆ నీటిని తోడే క్రమంలో మోటారు వేసేందుకు యత్నించగా విద్యుత్‌షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. అపార్ట్‌మెంట్‌ వాసులు గమనించి ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ఆయన మృతిచెందారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని