coronavirus: భయం ‘సంపే’సింది

తాజా వార్తలు

Published : 24/04/2021 12:02 IST

coronavirus: భయం ‘సంపే’సింది

ఉంగుటూరు: కరోనా సోకిందన్న భయంతో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మణ్(30) అనే వ్యక్తి తనకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో నీటి సంపులోకి దూకాడు. నీటిలో ఊపిరాడక మరణించాడు. మృతుడికి భార్య ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ విషయం తెలిసి మృతదేహాన్ని వెలికితీసేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని