ap news: అనకాపల్లి వద్ద కూలిన వంతెన

తాజా వార్తలు

Updated : 07/07/2021 05:56 IST

ap news: అనకాపల్లి వద్ద కూలిన వంతెన

అనకాపల్లి: విశాఖ జిల్లాలోని అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అనకాపల్లి శంకర్‌మఠ్‌ కూడలి వద్ద ఇంటర్‌ఛేంజ్‌ రహదారి నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాణంలో వంతెన సైడ్‌ పిల్లర్‌ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో కారు, ఆయిల్‌ ట్యాంకర్‌ ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్‌ లో ఉన్న వారికి గాయాలవడంతో వారిని అనకాపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్ధంతో కూలడంతో జనం పరుగులు తీశారు. కూలిన బ్రిడ్జి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బ్రిడ్జి కింద ఇంకెవరైనా చిక్కుకున్నారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు నూకాలమ్మ దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. వంతెన పిల్లర్‌ కారుపై పడటంతో పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్నది ఇద్దరా? ముగ్గురా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చీకటిపడటంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది. ప్రమాద ఘటనతో అనకాపల్లి వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వంతెన సైడ్‌ పిల్లర్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో వంతెన నిర్మాణంలో నాణ్యతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణంలో లోపాలే ఈ ప్రమాదానికి కారణమా అన్నది తెలియాల్సి ఉంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని