Asaduddin Owaisi: దిల్లీలో అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై దుండగుల దాడి.. ఐదుగురు అరెస్ట్‌!

తాజా వార్తలు

Updated : 22/09/2021 03:50 IST

Asaduddin Owaisi: దిల్లీలో అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై దుండగుల దాడి.. ఐదుగురు అరెస్ట్‌!

దిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నివాసంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. దిల్లీలోని అశోక రోడ్డులో ఉన్న ఆయన ఇంటిపై  కొందరు దాడి చేశారు. కిటికీ అద్దాలు పగులగొట్టారు. ప్రహరీ గోడ, గేటును ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న దిల్లీ పోలీసులు ఒవైసీ ఇంటి వద్దకు చేరుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీసీపీ దీపక్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై దాడికి పాల్పడిన మొత్తం ఐదురుగు నిందితులను అరెస్టు చేశాం. ఎంపీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో కోపోద్రిక్తులై ఈ దాడికి పాల్పడినట్లు నిందితులు విచారణలో తెలిపారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం’ అని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని