చెంపదెబ్బకు ప్రాణం పోయింది!
close

తాజా వార్తలు

Published : 18/03/2021 01:23 IST

చెంపదెబ్బకు ప్రాణం పోయింది!

దిల్లీ: కుమారుడు కొట్టిన చెంపదెబ్బకు ఓ తల్లి కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దిల్లీలోని ద్వారక ప్రాంతంలో నివాసముండే అవ్‌తార్‌ కౌర్‌ (76)కు పక్కింట్లో ఉండేవారితో పార్కింగ్‌ స్థలంపై సోమవారం మధ్యాహ్నం గొడవ జరిగింది. దీంతో ఆ పక్కింటి వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వారితో గొడవ విషయమై అవ్‌తార్‌ కౌర్‌కు, ఆమె కుమారుడు రణ్‌బీర్‌ (45), కోడలికి మధ్య ఇంటి బయట కొద్ది సేపు చర్చ సాగింది. ఈనేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన రణ్‌బీర్‌.. తల్లిని చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు కుప్పకూలిపోయింది. కోడలు ఆమెను లేపేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు రణ్‌బీర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని