close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనా కేటుగాళ్లు..అనుమతి పత్రాల పేరిట వసూళ్లు

అమీర్‌పేట : హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులకు సొంతూళ్లు వెళ్లేందుకు అనుమతి పత్రాలిప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో బస్తీ అధ్యక్షుడితోపాటు ఓ హోంగార్డు ఉన్నారు. వివరాలు..ఎస్సార్‌నగర్‌లోని పలు హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతి పత్రాల కోసం పోలీసులకు రెండు రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. తాము ఏ ఇబ్బంది లేకుండా వాటిని ఇప్పిస్తామని కొందరు హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ దర్యాప్తు చేపట్టింది. ఎస్సార్‌నగర్‌లోని ఓ హాస్టల్‌ నిర్వాహకుడు, గుంటూరు జిల్లా పిడిగురాళ్లకు చెందిన ఏలూరి రామకృష్ణ(42), సెంట్రల్‌ జోన్‌లో హోంగార్డుగా పనిచేసే భీమ్‌సింగ్‌(40), బాపూనగర్‌ బస్తీ అధ్యక్షులు హరిసింగ్‌ జాదవ్‌(42)ను అరెస్టు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.