ఇద్దరు కరోనా బాధితుల ఆత్మహత్య

తాజా వార్తలు

Published : 29/05/2020 03:24 IST

ఇద్దరు కరోనా బాధితుల ఆత్మహత్య

చెన్నై: కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నైలోని రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. 24 గంటల వ్యవధిలోనే ఈ రెండు ఆత్మహత్యలు వెలుగుచూడడం తమిళనాట కలకలం రేగింది.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన కరోనా సోకిన వ్యక్తి (50) ఇక్కడి స్టాన్లీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా లక్షణాలతో ఆస్పత్రికి చేరిన అతడికి పాజిటివ్‌గా తేలింది. మంగళవారం మూత్రశాలలో అతను ఉరివేసుకున్నాడు. మరో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి (57) సైతం బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ రెండు ఘటనలకు సంబంధించి స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారు. తమిళనాడు రాష్ట్రాన్ని, అటు చెన్నై నగరాన్ని కరోనా వైరస్‌ వణికిస్తున్న వేళ ఈ రెండు ఆత్మహత్యలు వెలుగుచూడడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని